DEVOTIONAL

బాబా స‌న్నిధిలో బాబు

Share it with your family & friends

ద‌ర్శించుకున్న భువ‌నేశ్వ‌రి

మ‌హారాష్ట్ర – ప్ర‌సిద్ద ప్రార్థ‌నా స్థ‌లం మ‌రాఠా లోని షిర్దీని ద‌ర్శించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న‌తో పాటు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి కూడా ఉన్నారు. ఆల‌య క‌మిటీ నిర్వాహ‌కులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు బాబు కుటుంబానికి . ఈ సంద‌ర్బంగా చంద్ర‌బాబు నాయుడు షిర్డీ లో కొలువు తీరిన సాయి బాబా విగ్ర‌హానికి పూల‌మాల‌లు స‌మర్పించారు. అనంత‌రం ఆయ‌న‌కు బాబా చిత్ర ప‌టాన్ని, ప్ర‌సాదాన్ని అంద‌జేశారు పూజారాలు. ఆల‌య నిర్వాహ‌కులు.

సాయి బాబాను ద‌ర్శించుకున్న అనంత‌రం టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. బాబా జీవితం ఆద‌ర్శ ప్రాయ‌మ‌ని పేర్కొన్నారు. కోట్లాది మందికి ఆయ‌న స్వాంతన చేకూరుస్తున్నార‌ని పేర్కొన్నారు.

కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌రుడు మ‌న్న‌న‌లు అందుకుంటే షిర్డీ సాయి నాథుడు మాత్రం మ‌నుషుల‌లో మ‌రింత సేవా భావాన్ని, భ‌క్తిని పెంపొందించేలా చేస్తున్నారంటూ కొనియాడారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో ఉన్నంత తృప్తి ఇంకెందులోనూ క‌ల‌గ‌ద‌న్నారు. సేవ కూడా దైవ‌త్వంలో ఒక భాగ‌మేన‌ని పేర్కొన్నారు చంద్ర‌బాబు నాయుడు. స్వామిని ద‌ర్శించు కోవ‌డం సంతోషంగా ఉందన్నారు.