ఐటీ అభివృద్దికి సహకరించండి
దావోస్ – దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు తండ్రీ కొడుకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సు సందర్బంగా దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో సమావేశం అయ్యారు. ఏపీలో ఐటీ అభివృద్దికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. త్వరలో రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్శిటీ సలహా మండలిలో భాగస్వామ్యం వహించాలని విన్నవించారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు బిల్ గేట్స్.
అంతకు ముందు ప్రపంచంలో టాప్ కంపెనీలకు చెందిన సీఇఓలు, చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశం అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ప్రధానంగా ఏపీని ఐటీ , ఇండస్ట్రియల్, ఫార్మా హబ్ గా మారుస్తున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్.
ఇదిలా ఉండగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే చోట సమావేశం కావడం విశేషం. మహరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.