7న ఢిల్లీకి బాబు..పవన్
మరోసారి ఎన్డీయే మీటింగ్
న్యూఢిల్లీ – దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కొలువు తీరనున్నారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందస్తుగా ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలకు చెందిన నేతలందరితో లేఖలు రాయించుకున్నారు.
రాజకీయాలలో ఏమైనా జరగవచ్చనే అనుమానంతో ప్రీ ప్లాన్ గానే ప్రిపేర్ చేశారు ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షా. ఇందులో భాగంగా ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కొలువు తీరనున్నారు.
ఇందుకు సంబంధించి ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 7న తిరిగి మరోసారి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కీలక సమావేశం కానున్నాయి. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిలుపు అందుకున్నారు.
ఏపీలో భారీ మెజారిటీని సాధించింది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. అత్యధికంగా సీట్లను కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్యా బలాన్ని కలిగి ఉంది. మొత్తంగా బాబు, పవన్ కీలకంగా మారడం విశేషం.