చర్చోప చర్చలు కుదరని సీట్లు
సీట్ల కోసం బాబు..పవన్ కసరత్తు
అమరావతి – ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తిని రేపుతున్నాయి. ఈసారి ఎలాగైనా సరే వైసీపీ సర్కార్ కు షాక్ ఇవ్వాలని టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు. ఆయన పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో జత కట్టారు. కలిసికట్టుగా పోరాటం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. కానీ సీట్ల సర్దుబాటు విషయంలో కొలిక్కి రాలేదు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకునే స్థాయికి వెళ్లింది.
దీంతో టీడీపీ, జనసేన పార్టీలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఆదివారం ఎలాగైనా సరే 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. అమరావతిలో ఇద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జనసేన 50కి పైగా స్థానాలు కోరుతుండగా తెలుగుదేశం పార్టీ మాత్రం కేవలం 25 స్థానాలకు మాత్రమే మొగ్గు చూపుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదంటూ చంద్రబాబు స్పష్టం చేసినట్లు టాక్. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలో అత్యధిక సీట్లను కోరుతున్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క అసెంబ్లీ సీటు కావాలని పట్టు పట్టినట్లు టాక్.