నిరుద్యోగులకు ఖుష్ కబర్
ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువు తీరిన నారా చంద్రబాబు నాయుడు తిరుమలను దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా బెజవాడకు చేరుకున్నారు. ఇంద్ర కీలాద్రిలో కొలువై ఉన్న శ్రీ కనక దుర్గ అమ్మ వారిని దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా. అక్కడి నుంచి రాష్ట్ర సచివాలయానికి బయలు దేరారు.
రోడ్డుకు ఇరు వైపులా నారా చంద్రబాబు నాయుడుకు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాదర స్వాగతం పలికారు. సెక్రటేరియట్ కు 5 ఏళ్ల తర్వాత చేరుకున్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు.
అంతే కాకుండా గత వైసీపీ సర్కార్ తీసుకు వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఫెన్షన్ల పెంపుపై మూడో సంతకం చేశారు సీఎం. నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు నారా చంద్రబాబు నాయుడు.