ప్రకటించిన చంద్రబాబు నాయుడు
అమరావతి – తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆయన మహిళలకు ఖుష్ కబర్ చెప్పారు. తెలంగాణలో పవర్ లోకి వచ్చేందుకు ఎక్కువగా ఆకర్షించిన హామీ ఏదైనా ఉందంటే అది బస్సులలో ఉచితంగా మహిళలకు ప్రయాణం కల్పించడం. ఈ ఒక్క గ్యారెంటీ పవర్ లోకి వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించింది.
దీనిపై దృష్టి పెట్టిన చంద్రబాబు నాయుడు ఖుష్ కబర్ చెప్పారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గనుక అధికారంలోకి వస్తే తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
దీని వల్ల మహిళల్లో మరింత ఆత్మ విశ్వాసం పెరుగుతుందని, తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత తనదేనని చెప్పారు. తాము ఏర్పాటు చేసిన సంఘాలు ఇవ్వాళ స్వయం సమృద్దిన సాధించాయని, ఇతరులకు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగాయని అన్నారు నారా చంద్రబాబు నాయుడు.