టీడీపీకి విరాళాలు ఇవ్వండి
చంద్రబాబు నాయుడు పిలుపు
అమరావతి – ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందన్నారు. ఇందు కోసం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరితో పాటు టీడీపీకి చెందిన సీనియర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తమ వంతుగా తమకు తోచినంతగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం సందర్బంగా చంద్రబాబు నాయుడు టీడీపీఫర్ ఆంధ్ర పేరుతో ఓ పోర్టల్ ను ప్రారంభించారు. టీడీపీ అనేది తెలుగు ప్రజల జీవితాలలో ఒక భాగంగా ఉందన్నారు. టీడీపీ గెలవడం అంటే ప్రజలు గెలిచినట్టేనని స్పష్టం చేశారు.
పార్టీ బలోపేతం కావడం ఇవాళ అత్యంత అవసరమని పేర్కొన్నారు. అందుకే పార్టీని నడిపించే బాధ్యతలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రగతి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన తెలుగుదేశం అనే నినాదంతో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో వెబ్ సైట్ ను తీసుకు వచ్చామన్నారు టీడీపీ చీఫ్.
పార్టీ పరంగా లబ్ది పొందిన వారంతా సాయం చేయాలని కోరారు.