టీడీపీ విప్ గా గంటి హరీశ్ మాధుర్
నియమించిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – టీడీపీ చీఫ్ , ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు లోక్ సభలో ఇవాళ స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఎవరు ఎన్నిక అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం కేంద్రంలో కీలకమైన రోల్ పోషిస్తున్నారు టీడీపీ చీఫ్ , సీఎం చంద్రబాబు నాయుడు. తమ పార్టీకి కీలకమైన స్పీకర్ పోస్టు కావాలని ఆయన పట్టు పడుతున్నారు. ఇదే సమయంలో మరో కీలక భాగస్వామిగా ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ సైతం తమకు సభా పతి పోస్ట్ కావాలని పట్టు పడుతున్నట్లు సమాచారం.
అయితే చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. లోక్ సభలో టీడీపీ విప్ గా అమలాపురం నుంచి ఎన్నికైన గంటి హరీశ్ మాధుర్ ను నియమించారు. ఈ మేరకు పార్టీ ఆదేశాలు జారీ చేసింది. హరీశ్ మాధుర్ మరెవరో కాదు.. దివంగత బాలయోగి తనయుడు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన 3.42 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేసిన చంద్రబాబు.. ఇప్పుడాయన కుమారుడికి విప్ బాధ్యతలు అప్పగించడం గమనార్హం