NEWSANDHRA PRADESH

చంద్ర‌బాబుకు బిగ్ షాక్

Share it with your family & friends

సీఐడీ చార్జిషీట్ దాఖ‌లు

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర బాబు నాయుడుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే ఏపీ సీఐడీ ఆయ‌న‌పై ఎనిమిది కేసులు న‌మోదు చేసింది. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో కోలుకోలేని దెబ్బ త‌గిలింది. ఏకంగా 53 రోజుల పాటు రాజ‌మండ్రి జైలులో ఉన్నారు. నానా తంటాలు ప‌డుతూ అతి క‌ష్టం మీద బెయిల్ తెచ్చుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారు.

చంద్ర‌బాబు నాయుడుతో పాటు త‌న‌యుడు నారా లోకేష్ బాబుపై కూడా కేసు న‌మోదు చేసింది ఏపీ సీఐడీ. తాజాగా మ‌రో షాక్ ఇచ్చింది చంద్ర‌బాబుకు. అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో ఏసీబీ (అవినీతి నిరోధ‌క శాఖ‌) కోర్టులో సీఐడీ చార్జిషీట్ దాఖ‌లు చేసింది.

ఈ కేసులో నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు నారాయ‌ణ సంస్థ‌ల చైర్మ‌న్ , మాజీ మంత్రి నారాయ‌ణ‌, నారా లోకేష్ , లింగ‌మ‌నేని ర‌మేష్ తోపాటు రాజశేఖ‌ర్ ను నిందితులుగా పేర్కొంది. ఐఆర్ఆర్ కేసులో అనుచితంగా ల‌బ్ది పొందార‌ని ఆరోపించింది. ఈ మొత్తం వ్య‌వహారం అంతా ఆనాటి సీఎం చంద్ర‌బాబు నాయుడు తో పాటు మంత్రి నారాయ‌ణ క‌నుస‌న్న‌ల‌లో జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేసింది. ఇందుకు సంబంధించి త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని పేర్కొంది.