రామోజీరావు తెలుగు వెలుగు
ఆయన లేని లోటు తీర్చలేం
అమరావతి – ఈనాడు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు ఇక లేరన్న వార్త తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ సందర్బంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన లేని లోటు తెలుగు వారికే కాకుండా యావత్ దేశానికి కూడా తీరని నష్టం అని పేర్కొన్నారు.
ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు అక్షర యోధుడుగా రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు.
తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీరావు తెలుగు ప్రజల ఆస్తి అని స్పష్టం చేశారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని, ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని తెలిపారు.
. మీడియా రంగంలో రామోజీది ప్రత్యేకమైన శకమని. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి…ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు.
దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం రామోజీరావు పనిచేశారని ప్రశంసించారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరం, ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించు కోలేక పోతున్నామన్నారు.