9న బాబు ముహూర్తం ఖరారు
ఎన్డీయేలో చేరేందుకు ఆసక్తి
అమరావతి – రాజకీయాలలో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరనేది చంద్రబాబు ను చూస్తే తెలుస్తుంది. ఆయన నిన్నటి దాకా బీజేపీని, ఎన్డీయేను, మోదీని అనరాని మాటలు అన్నారు. చివరకు జైలుకు వెళ్లాక ప్రధానితో అవగాహనకు వచ్చారు. తనకు ఎదురే లేదని భావిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడుకు తన సత్తా ఏమిటో చూపించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఇది పక్కన పెడితే తాజాగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. బీజేపీతో దోస్తీ చేసేందుకు ఇప్పటికే ఆ పార్టీకి చెందిన అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ చీఫ్ సోము వీర్రాజు ఢిల్లీకి చేరుకున్నారు. ఎంతైనా మరదలు కావడంతో బాబు ప్లాన్ వర్కవుట్ అయ్యింది.
ఇక ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఎట్టకేలకు టీడీపీ ఎన్డీయే గూటికి చేరడం ఖాయమని తేలి పోయింది. ఇందుకు సంబంధించి 9న ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ పొత్తు కన్ ఫర్మ్ అయితే 5 ఎంపీ సీట్లు, 9 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు టాక్.
పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన కూటమి బీజేపీకి ఇవ్వాలని అనుకున్న సీట్లు ఇవే. ఎంపీ స్థానాలకు సంబంధించి అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట లేదా హిందూపురం ఎంపీ స్థానాలు ఇవ్వాలని యోచిస్తోన్నట్లు సమాచారం.
ఇక అసెంబ్లీ స్థానాల పరంగా చూస్తే గుంటూరు వెస్ట్, విశాఖ నార్త్, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, కాళహస్తితోపాటు తిరుపతి, గోఎంపీదావరి, అనంతపురం జిల్లాల్లో ఒకొక్కటి ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు చేయనున్నట్లు టాక్.