మోదీ మద్దతు మరిచి పోలేను
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – నిన్నటి దాకా బీజేపీతో దూరంగా ఉంటూ వచ్చిన టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల వరకు వచ్చే సరికల్లా రూటు మార్చారు. ఆయన పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పాటయ్యారు. ఇదే పార్టీల సమన్వయంతో ఎన్నికల బరిలో నిలిచారు. ఈనెల 13న పోలింగ్ జరగనుంది. ఎవరు గెలుస్తారనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు నేతలు.
ప్రధానంగా జగన్ రెడ్డి ఆక్టోపస్ లా విస్తరించి ఉన్నాడు. ఆయన తనకు 170కి పైగా సీట్లు వస్తాయని ఇప్పటికే ధీమాగా ఉన్నారు. తాను ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని , ముచ్చటగా రెండోసారి సీఎంగా కొలువు తీరడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు జగన్ రెడ్డి.
ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా రాష్ట్రంలో పర్యటించారు. ఎన్నికల సభలలో పాల్గొన్నారు. ప్రధానంగా ఏపీ సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. బాబు హయాంలోనే ఏపీ అభివృద్ది చెందిందని చెప్పారు. జగన్ వచ్చాక సర్వ నాశనం తప్ప ఏమీ చేయలేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా మోదీకి ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు నాయుడు.