పొత్తు కోసం బాబు పయనం
మరోసారి ఢిల్లీకి టీడీపీ చీఫ్
అమరావతి – ఏపీలో పొత్తుల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ ప్రచారంలో దూసుకు వెళుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి వై నాట్ 175 అనే నినాదంతో ఏపీలో మరోసారి పవర్ లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు దూకుడు పెంచాయి.
ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ లు కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. గత కొంత కాలం నుంచీ పవన్ బహిరంగంగానే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు.
ఇక ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు చుక్కలు చూపించాడు సీఎం జగన్ రెడ్డి. 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో గడిపారు. ఆ తర్వాత ముందస్తు బెయిల్ పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత సీఎంను టార్గెట్ చేశారు \మాజీ సీఎం.
ఇందులో భాగంగా గత కొన్నేళ్లుగా ఎన్డీయేకు, బీజేపీకి దూరంగా ఉంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు రూట్ మార్చాడు. మరోసారి దోస్తీ చేసేందుకు మొగ్గు చూపారు. దీని వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారనేది బహిరంగ రహస్యం.
త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే చంద్రబాబు ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. గురువారం మరోసారి ఢిల్లీకి పయనమయ్యారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు.