రామోజీరావుకు భారత రత్న ఇవ్వాలి
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – తెలుగు వారి కీర్తి పతాకాన్ని ఎగుర వేసిన మహనీయుడు రామోజీ రావు అంటూ కితాబు ఇచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈనాడు సంస్థల అధిపతి ఇటీవలే అనారోగ్యంతో కన్ను మూశారు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా రామోజీరావు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు.
రామోజీరావు స్మృతిలో విజయవాడలోని కానూరు అనుమోలు గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం ప్రసంగించారు.
తెలుగు పత్రికా రంగమే కాదు అన్ని రంగాలలో అద్భుతంగా రాణించిన గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు . వ్యాపార రంగంలోనూ ప్రజాహితాన్ని చూసిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని చెప్పారు. తెలుగు జాతికి విశిష్టమైన సేవలు అందించిన వారిలో ప్రథములు దివంగత ఎన్టీఆర్, రామోజీ రావు అని అన్నారు.
ఈ ఇద్దరికీ భారత రత్న పురస్కారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు.