టీడీపీ అభ్యర్థులకు బి పారంలు
అందజేసిన పార్టీ చీఫ్ చంద్రబాబు
అమరావతి – ఏపీలో ప్రస్తుతం వచ్చే నెల మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఈసారి రెండు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ, మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీతో.
పొత్తులో భాగంగా కొన్ని సీట్లను ఆయా పార్టీలకు కేటాయించారు నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆదివారం తమ పార్టీ పరంగా ఇటు అసెంబ్లీలో , అటు లోక్ సభ ఎన్నికల బరిలో ఖరారు చేసిన ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులకు స్వయంగా బి ఫారంలు అందజేశారు.
ఈ సందర్బంగా పలువురికి దిశా నిర్దేశం చేశారు పార్టీ చీఫ్. మిగతా పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో కలిసి పోయి ముందుకు సాగాలని, ఈ మేరకు ఆయా అభ్యర్థులను గెలిపించుకునే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ఇక బి ఫారం అందుకున్న వారిలో నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబు కూడా ఉన్నారు. ఆయన ప్రస్తుతం మంగళగిరి నుంచి బరిలోకి దిగనున్నారు.