NEWSANDHRA PRADESH

పెనుమాక‌లో సీఎం పెన్ష‌న్లు పంపిణీ

Share it with your family & friends

ఎస్టీ కాల‌నీలో ల‌బ్దిదారుల‌కు అంద‌జేత‌

అమ‌రావ‌తి – ఏపీలో కొత్త‌గా కొలువు తీరిన చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన హామీల మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇందులో భాగంగా పెన్ష‌న్ల పంపిణీకి శ్రీ‌కారం చుట్టారు. జూలై 1 నుండి ప్రారంభించారు.

ఈ కార్య‌క్ర‌మానికి వేదిక‌గా మారింది గుంటూరు జిల్లా తాడేప‌ల్లి మండ‌లం పెనుమాక గ్రామం. ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్లు పంపిణీ చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఎస్టీ కాల‌నీలో నేరుగా ల‌బ్దిదారుల‌కు పంపిణీ చేశారు. పాముల నాయ‌క్ కుటుంబానికి ఫించ‌న్ అంద‌జేశారు.

ఆయ‌న‌కు వృద్దాప్య పెన్ష‌న్ తో పాటు నాయ‌క్ కూతురు వితంతు పెన్ష‌న్ అంద‌జేశారు ఏపీ సీఎం. ఈ సంద‌ర్బంగా ల‌బ్దిదారులు సంతోషానికి లోన‌య్యారు. ఇదే స‌మ‌యంలో త‌మ‌కు ఇల్లు లేద‌ని, త‌మ‌రు ద‌య ఉంచి ఇల్లు ఇప్పించే ప్ర‌య‌త్నం చేయాల‌ని కోరారు.

వారి విన్న‌పానికి సానుకూలంగా స్పందించారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇల్లు వెంటనే మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.