సగర్వంగా సభలోకి చంద్రబాబు
ఆనాడు అంతులేని రీతిలో అవమానం
అమరావతి – నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోస్ట్ పాపులర్ పొలిటిషియన్ గా గుర్తింపు పొందారు. ఒక రకంగా చెప్పాలంటే తను అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఆయనది.
నిరంతరం టెక్నాలజీ, అభివృద్ది అనే పదాలు తప్పా ఇంకే దాని గురించి మాట్లాడేందుకు ఇష్ట పడడు నారా చంద్రబాబు నాయుడు. నవ్యాంధ్రప్రదేశ్ ను తీర్చి దిద్దాలనేది ఆయన కల. ఇందుకు సంబంధించి ఉమ్మడి ఏపీకి తొలి సీఎంగా పని చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత అనేక రకాలుగా ఒడిదుడుకులను, ఆటు పోట్లను, ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరకు జైలు పాలైనా సగర్వంగా బయటకు వచ్చారు. బెయిల్ పై ప్రస్తుతం ముఖ్యమంత్రిగా నాలుగోసారి కొలువు తీరనున్నారు. తనను అవమానించిన నిండు సభ లోకి సగర్వంగా అడుగు పెట్టనున్నారు .