వైసీపీ దుష్ప్రచారం బాబు ఆగ్రహం
మేం పెన్షన్లను ఆపవద్దని కోరలేదు
అమరావతి – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. తాము ఎక్కడా పెన్షన్లను నిలుపుదల చేయమని ఏనాడూ కోరలేదన్నారు. బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత.
గత కొన్నేళ్లుగా అబద్దాలతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బతుకుతున్నాడని, నవ రత్నాలు పేరుతో మోసం చేశాడని, అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయని, ఇందులో ఎక్కువగా వైసీపీకి చెందిన వారే ఉన్నారని ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు.
కానీ ఎక్కడా తాము పేదలకు అందాల్సిన పెన్షన్లను నిలిపి వేయాలంటూ ఎక్కడా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. వైసీపీ పొద్దస్తమానం ఫేక్ ప్రచారాలతో పబ్బం గడపాలని చూస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు, జగన్ రెడ్డి బతుకే అబద్దాలతో నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
నీచమైన తీరు వారి డిఎన్ఎలోనే ఉందన్నారు. పెన్షన్ లు పంచవద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేశారు టీడీపీ చీఫ్.