కీలక పదవులపై బాబు మెలిక
మోడీ..అమిత్ షా ఒప్పుకుంటారా
అమరావతి – దేశ వ్యాప్తంగా ఎన్నికల పండుగ ముగిసింది. ఇక ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ కొలువు తీరనున్నారు. ఆయన ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈనెల 8 లేదా 9న యుద్ద ప్రాతిపదికన సీటుపై కూర్చోవాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన నమ్మిన బంటు అయిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా ఏర్పాట్లు కూడా చేసేశారు.
ఎవరినీ పీఎం పదవి దరి దాపుల్లో లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే 400 సీట్లు పక్కగా వస్తాయని ఆశించిన బీజేపీకి, దాని పరివారానికి చెంప ఛెళ్లుమనిపించేలా ఫలితాలు వచ్చాయి. ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి భారీ ఎత్తున సీట్లు రావడంతో విస్తు పోయింది ఎన్డీయే పక్షాలు.
ఇదిలా ఉండగా ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయి ఆంధ్రప్రదేశ్ , బీహార్ రాష్ట్రాలు. దీంతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు కింగ్ పిన్ గా అవతరించాడు. దీంతో తను మోడీ, షా ముందు కీలక పదవులు ఇవ్వాలని కోరినట్టు టాక్.
ఇందులో లోక్ సభ స్పీకర్ తో పాటు ఆర్థిక , ఆరోగ్య, విద్య, జల్ శక్తి (విద్యుత్) , నీటి పారుదల శాఖలు కావాలని పట్టుపట్టారని దీనికి ఏ మేరకు ఆమోదం లభిస్తుందనేది వేచి చూడాలి.