ప్రచారం సమాప్తం బాబు సంతోషం
వచ్చేది టీడీపీ కూటమిదే విజయం
అమరావతి – రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగేందుకు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
45 రోజుల పాటు అన్ని పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేశాయి. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ప్రస్తుతం అధికారంలో వైసీపీ ఉండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఇక ఈసారి గట్టిగా ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. వైఎస్ షర్మిలకు పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించింది.
ఈ సందర్బంగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అందరికంటే ప్రచారంలో ముందంజలో ఉన్నారు. శనివారం నాటితో ఎన్నికల ప్రచారం ముగిసింది. జగన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ సభలలో పాల్గొన్నారు. ఆయన ప్రధానంగా జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. వైసీపీ దురాగతాలను ఎండగట్టారు.
తప్పకుండా టీడీపీ కూటమి గెలవడం ఖాయమని జోష్యం చెప్పారు చంద్రబాబు నాయుడు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ బాస్ మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నారు గెలుస్తామని.