ఎలాన్ మస్క్ కు గ్రాండ్ వెల్ కమ్
స్పష్టం చేసిన చంద్రబాబు
అమరావతి – ప్రపంచ కుబేరుడిగా, టెస్లా సంస్థ చైర్మన్ గా , ట్విట్టర్ ఓనర్ గా పేరు పొందిన ఎలాన్ మస్క్ త్వరలోనే భారత దేశాన్ని సందర్శించనున్నారు. ఆయన ఇప్పటికే పలు రంగాలలో కీలకమైన పెట్టుబడులు పెట్టారు. ప్రధానంగా ప్రపంచ మార్కెట్ లో కీలకమైన పాత్ర పోషిస్తోంది ఇండియా. దీంతో తను కూడా భారత్ పై ఫోకస్ పెట్టారు ఎలాన్ మస్క్.
ఈ సందర్బంగా 2017లో తాను సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పెను ఆసక్తిని చూపించారని ఈ సందర్బంగా గుర్తు చేశారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా అరుదైన ఫోటోను పంచుకున్నారు. తను ఎలాన్ మస్క్ తో దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ గా మారింది.
మీ రాక కోసం తామంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నామని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. తాము కొత్త దనం కావాలని కోరుకుంటామని, ప్రధానంగా ఆటోమొబైల్స్ రంగంలో టాప్ లో కొనసాగుతున్న టెస్లా కంపెనీని ఇక్కడ స్థాపించేందుకు తాము సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు.
త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయని, ఇక టీడీపీ కూటమి పవర్ లోకి రానుందని దీంతో టెస్లా సీఇఓ, ఓనర్ కు గ్రాండ్ వెల్ కమ్ చెబుతామని తెలిపారు టీడీపీ చీఫ్.