NEWSANDHRA PRADESH

విభ‌జ‌న శాపం ఏపీకి న‌ష్టం

Share it with your family & friends

సీఎం చంద్ర‌బాబు ఆవేద‌న

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. అప్ప‌టి కాంగ్రెస్ స‌ర్కార్ అనాలోచితంగా ఏపీని విభ‌జించ‌డం వ‌ల్ల త‌మ రాష్ట్రానికి తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని వాపోయారు. మంగ‌ళ‌వారం శాస‌న స‌భ‌లో కీల‌క ప్ర‌సంగం చేశారు.

విభజన వల్ల ఏపీకి అపార‌మైన నష్టం వాటిల్లింద‌న్నారు చంద్ర‌బాబు నాయుడు.. గత ఐదేళ్ల పాలన వల్ల ఏపీ రాజధాని ఏంటో క్లారిటీ లేని పరిస్థితి వచ్చిందన్నారు.. బడ్జెట్‌ కూడా పెట్టుకోలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉందని ఆవేద‌న చెందారు సీఎం.

.ఆర్థిక గందరగోళ పరిస్థితులు చక్కదిద్ది మరో రెండు నెలల తర్వాత బడ్జెట్ పెట్టుకునే పరిస్థితి ఉందన్నారు. ఇబ్బందులను అధిగమించి ఏపీని నెంబర్-1 స్థానంలో నిలపాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆప‌ద్బాంధ‌వుడిలా ఇక్క‌డికి వ‌చ్చాడ‌ని కితాబు ఇచ్చారు.

రాష్ట్రం కోసం ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం తెలుగుదేశం పార్టీ-జ‌న‌సేన క‌లిసే ముందుకు సాగుతాయ‌ని ప్ర‌క‌టించార‌ని , గొప్ప లీడ‌ర్ అంటూ కితాబు ఇచ్చారు చంద్ర‌బాబు నాయుడు.దళితులని చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళతో కలిసి నిన్న జ‌గ‌న్ రెడ్డి “సేవ్ డెమోక్రసీష‌ అన‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.