రేవంత్ రెడ్డికి నేనే లేఖ రాశా
కలిసి సమస్యలు పరిష్కరించు కోవాలి
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు. తానే ముందు సీఎంకు లేఖ రాశానని చెప్పారు. ఆదివారం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.
ఏపీ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా ఇంకా సమస్యలు పరిష్కారం కాక పోవడం బాధాకరమని అన్నారు. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చొరవ తీసుకోలేదని ధ్వజమెత్తారు. తాను వచ్చాక ఇరు తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా వేరైనప్పటికీ తెలుగు వారంతా ఒక్కటేనని అన్నారు.
అందుకే తానే ముందు చొరవ తీసుకున్నట్లు తెలిపారు సీఎం. తాను రాసిన లేఖకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. తెలుగు వారంతా ఎక్కడున్నా ఒక్కటిగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరి పాలన వారిదైనప్పటికీ తెలుగు వారి జోలికి వస్తే అంతా ఒక్కటేనని చాటి చెప్పాలన్నారు నారా చంద్రబాబు నాయుడు.
అయితే కొందరు రెండు రాష్ట్రాల వారు గొడవలు పెట్టుకోవాలని కోరుకుంటున్నారని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.