Wednesday, April 9, 2025
HomeNEWSANDHRA PRADESHసిద్దాంతాల ఆధారంగా రాజ‌కీయాలు చేశా

సిద్దాంతాల ఆధారంగా రాజ‌కీయాలు చేశా

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – సీఎం చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను వ్య‌క్తిగ‌త రాజ‌కీయాలు చేయ‌లేద‌న్నారు. సిద్ధాంతాల ఆధారంగానే పాలిటిక్స్ చేస్తూ వ‌స్తున్నాన‌ని అన్నారు. రాష్ట్రంలో కొలువు తీరాక తీవ్ర ఇబ్బందులు ప‌డ్డామ‌న్నారు. గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసింద‌ని ఆరోపించారు. ఇచ్చిన హామీలు నెర‌వేర్చేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. ఆరు నూరైనా ఎన్ని కోట్లు అయినా స‌రే సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆదివారం సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. తాను ఎవ‌రినీ వ్య‌క్తిగ‌తం టార్గెట్ చేసిన దాఖ‌లాలు లేవన్నారు. జ‌గ‌న్ లాంటి అహంకార పూరిత నేత‌ను ఎక్క‌డా చూడ‌లేద‌న్నారు. అందుకే ప్ర‌జ‌లు త‌న‌ను 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌ని మండిప‌డ్డారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించారు నారా చంద్ర‌బాబు నాయుడు. మన రాష్ట్రంలో ఇలాంటి అహంకారులతో రాజకీయాలు చేయాల్సి వస్తున్నందుకు బాధగా ఉందన్నారు.

మన రాష్ట్ర రైతులు చాలా తెలివైన వాళ్లని, ఒక్క‌సారి చెబితే చాలు అల్లుకు పోతారని అన్నారు. సాగునీరు పుష్కలంగా ఉన్న అనేక చోట్లకు మన రైతులు వెళ్లారని తెలిపారు. ప్రకృతి సాగు ఉత్పత్తులకు మంచి ధర వస్తోందన్నారు. ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్‌గా మారే శక్తి ఏపీకి ఉందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments