ప్రజల కోసమే పొత్తు – బాబు
కూటమి గెలవడం ఖాయం
అమరావతి – తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకే తాము జనసేన , భారతీయ జనతా పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరిగిందన్నారు. ఈ పొత్తు వ్యక్తిగతమైనది కాదని ప్రజల బాగు కోసం మాత్రమేనని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. దగా పడిన రైతుల కోసం, ఉపాధి, ఉద్యోగాలు లేక నానా తంటాలు పడుతున్న యువతీ యువకుల కోసం, భద్రత కోల్పోయిన మహిళల కోసం తాము పొత్తు పెట్టుకోవడం జరిగిందని చెప్పారు.
అంతకంటే మించి గత కొన్నేళ్లుగా విధ్వంసమై పోయిన రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం తాము కలిసి అడుగులు వేస్తున్నామని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. కూటమి గెలుపు పక్కా అని, జగన్ మోహన్ రెడ్డి పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు.
ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడని, ఇక ఏం మిగిలిందని దోచుకోవడానికి అంటూ మండిపడ్డారు టీడీపీ చీఫ్. ఇకనైనా ప్రజలు తమ విలువైన ఓటును టీడీపీ, జనసేన, బీజేపీకి వేయాలని కోరారు.