ఏపీకి అమరావతి రాజధాని
చంద్రబాబు నాయుడు ప్రకటన
అమరావతి – టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను జగన్ రెడ్డి మోసం చేశాడని ఆరోపించారు. కానీ తాము ముందు నుంచీ అమరావతినే ఏపీకి అసలైన రాజధాని అంటూ ప్రకటిస్తూ వచ్చామని అన్నారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఆనాడు దివంగత కేంద్ర మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ సైతం అమరావతినే రాజధాని అని స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. పోలవరంతో పాటు అమరావతిని వద్దని ఏనాడూ బీజేపీ అనలేదని చెప్పారు చంద్రబాబు నాయుడు.
రాష్ట్రంలో ఉండే మేధావులు అంతా అభివృద్దికి సంబంధించి ఏమేం చేయాలో తమకు సూచనలు ఇవ్వాలని కోరారు. సెంటిమెంట్ కోసం ప్రత్యేక హోదా ఆనాడు అడిగానని , కానీ ఇవ్వక పోవడంతో తాను విభేదించానని చెప్పారు. అంతే తప్పా తనకు బీజేపీకి ఎక్కడా అభిప్రాయ భేదాలు రాలేదని స్పష్టం చేశారు టీడీపీ చీఫ్ .
ఇదిలా ఉండగా మొన్నటికి మొన్న జరిగిన చర్చల్లో ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగిందన్నారు.