NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ ను న‌మ్మ‌ని జనం

Share it with your family & friends

చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – ఏపీలో జ‌గ‌న్ రెడ్డి ప‌నై పోయింద‌ని ఎద్దేవా చేశారు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా పాల్గొన్నారు. ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు.

రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డిదేన‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చి త‌న‌పై ఆ నెపం నెట్టివేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు నాయుడు. సంక్షేమ ప‌థ‌కాల పేరుతో జ‌నాన్ని బురిడీ కొట్టించార‌ని ఆరోపించారు.

ప్ర‌జ‌ల‌ను స‌ర్వ నాశ‌నం చేశార‌ని పేర్కొన్నారు . ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్ష కోట్ల అప్పు చేశార‌ని, దానిని తీర్చ‌లేక నానా తంటాలు ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో జ‌గ‌న్ రెడ్డి పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో కూట‌మి గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.

అసెంబ్లీలో 175 స్థానాల‌కు గాను 170 స్థానాలు , లోక్ స‌భ స్థానాలు 25 కు గాను 20కి పైగా ఎంపీ స్థానాలు వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు టీడీపీ చీఫ్‌.