పవర్ లోకి వస్తే ఇంటి వద్దకే పెన్షన్
నారా చంద్రబాబు నాయుడు ప్రకటన
అమరావతి – టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా గళం బహిరంగ సభలో పాల్గొన్నారు. తాము గనుక అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందజేస్తామని ప్రకటించారు.
ఇందులో భాగంగా ఎంపికైన వారిక ఒక్కొక్కరికీ రూ. 4,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంటి వద్దకే వచ్చి ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ సర్కార్ ఫించన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే వారికి ఇప్పటి నుంచే పెన్షన్ సౌకర్యాన్ని వర్తింప చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, జగన్ రెడ్డి అబద్దాలతో ప్రచారం చేపడుతున్నాడని మండిపడ్డారు. అయినా సీఎం ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎంతగా దౌర్జన్యానికి పాల్పడినా పప్పులు ఉడుకవు అన్నారు. టీడీపీ కూటమి తప్పకుండా గెలుస్తుందని, రాబోయే రోజుల్లో ప్రజా పాలన అందిస్తామని హామీ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు.