రాజంపేటను జిల్లా చేస్తాం
నారా చంద్రబాబు నాయుడు
కడప జిల్లా – తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కడప జిల్లా రాజంపేటలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా జగన్ రెడ్డి సర్కార్ అడ్డగోలుగా జిల్లాలను ఏర్పాటు చేసిందని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు. కొన్ని ప్రాంతాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగా రాజంపేట ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న విషయం తనకు అర్థమైందన్నారు. జగన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని, ఇక తాము అధికారంలోకి రావడం తథ్యమని చెప్పారు. సంతకం చేసిన వెంటనే రాజంపేట ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి తీరుతామని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. ఎవరూ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.
తాను చెప్పానంటే చేసి చూపించడం ఖాయమని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.