మహిళా సంఘాల ఏర్పాటు నాదే
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 30 ఏళ్ల కిందట తాను డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేస్తానంటూ అంతా గేళి చేశారని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత తాను వారికి అండగా నిలిచానని, అవే మహిళా సంఘాలు ఇవాళ ఆదర్శ ప్రాయంగా మారాయని అన్నారు.
భవిష్యత్తులో వారు మరింత ఎదిగేందుకు, మహరాణులుగా మారేందుకు ఆస్కారం ఉంటుందన్నారు నారా చంద్రబాబు నాయుడు. విజన్ లేనటువంటి నాయకుడు జగన్ అంటూ మండిపడ్డారు. ఆయనకు సోయి లేదన్నారు. పాలన చేత కాదన్నారు. అందుకే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడంటూ ఆరోపించారు.
తమ కూటమి అధికారంలోకి వస్తుందని, ఇక జగన్ పాలనకు చరమ గీతం పాడతామన్నారు. మహిళలకు పెద్ద పీట వేస్తామన్నారు. మహిళా సంఘాలకు తోడ్పాటు అందిస్తామని, ఆదాయం పెరిగేలా కృషి చేస్తామని చెప్పారు చంద్రాబు నాయుడు.
రివాల్వింగ్ ఫండ్, వడ్డీ లేని రుణాలు, డ్వాక్రా బజార్లు, పసుపు కుంకుమ వంటివి ఎన్నో అందించి సహకరిస్తామన్నారు. ఇక రాబోయే భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందన్నారు టీడీపీ చీఫ్.