NEWSTELANGANA

తెలంగాణ‌లో టీడీపీ బలోపేతం కావాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు

హైద‌రాబాద్ – తెలుగుదేశం పార్టీ చీఫ్‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇటు ఏపీలో పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింద‌ని, ఇక తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ బ‌ల‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

టీడీపీకి ఏ పార్టీకి లేనంత‌గా బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. కార్య‌క‌ర్త‌లు, నేత‌లు, అభిమానులు, శ్రేయోభిలాషులు తెలంగాణ‌లో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కోరుతున్నార‌ని అన్నారు.

చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇదే స‌మ‌యంలో ఏపీని పున‌ర్ నిర్మించాల‌ని, ఇక్క‌డి మ‌నోభావాల‌ను గౌర‌వించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు ఏపీ సీఎం.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ‌లో పుట్టింద‌న్నారు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులం ఇచ్చి పుచ్చుకునే ధోర‌ణిలో వెళుతున్నామ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎవ‌ర‌నే దానిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.