తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తా
సీఎం నారా చంద్రబాబు నాయుడు
తిరుమల – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తిరుమలను సందర్శించారు. శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ అలివేలు మంగమ్మలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
అనంతరం నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. తిరుమల అనేది పవిత్రమైన పుణ్య క్షేత్రమని, కోట్లాది మంది భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతోందన్నారు.
ఈ క్షేత్రంలో గోవింద నామ నినాదాలు తప్ప మరేవీ వినిపించ కూడదని స్పష్టం చేశారు. అలా ఎవరైనా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పవిత్రమైన ఈ పుణ్య స్థలాన్ని అపవిత్రం చేయడం సరికాదన్నారు చంద్రబాబు నాయుడు.
తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందన్నారు. తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం వినిపించ కూడదని స్పష్టం చేశారు.