NEWSANDHRA PRADESH

వాలంటీర్లు జ‌గ‌న్ మాట‌లు న‌మ్మొద్దు

Share it with your family & friends

గౌర‌వ వేత‌నం రూ. 10 వేలు ఇస్తాం
అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వాలంటీర్ల‌కు ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. ప్ర‌జా గ‌ళం పేరుతో చేప‌ట్టిన యాత్ర‌లో పాల్గొన్నారు. మంగ‌ళ‌వారం శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రం పుర‌స్క‌రించుకుని టీడీపీ కార్యాల‌యంలో ఉగాది వేడుక‌లు చేప‌ట్టారు. ఈ ఏడాది రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మేలు జ‌ర‌గ బోతోంద‌ని అన్నారు.

ఎందుకంటే రాక్ష‌స పాల‌న సాగిస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇక ఇంటికి వెళ్ల‌డం ఖాయ‌మ‌న్నారు. తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన‌, బీజేపీల‌తో కూడిన ఎన్డీయే కూట‌మి ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా పాల‌న రాబోతోంద‌ని జోష్యం చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.

ఇక రాష్ట్రంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నియ‌మించిన వాలంటీర్ల‌ను తాము కంటికి రెప్ప‌లా చూసుకుంటామ‌ని చెప్పారు. కానీ వారు సీఎం మాట‌లు న‌మ్మి మోస పోవ‌ద్ద‌ని సూచించారు. త‌న రాజ‌కీయ స్వార్థం కోసం మిమ్మ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.

తాము అధికారంలోకి వ‌చ్చాక వాలంటీర్ల‌కు పూర్తి భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. అంతే కాదు వారంద‌రికీ రూ. 10 వేలు గౌర‌వ వేత‌నం అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు నారా చంద్ర‌బాబు నాయుడు.