సీఎం షిండేతో చంద్రబాబు భేటీ
కీలక అంశాలపై చర్చించిన నేతలు
ముంబై – అనిల్ అంబానీ, నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ బారాత్ వేడుకలలో పాల్గొన్నారు కుటుంబ సమేతంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, భార్య భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి. ఈ సందర్బంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం రిలయన్స్ చైర్మన్ తో సంభాషించారు. అక్కడే ఉన్న మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ను కలుసుకున్నారు.
ఈ సందర్బంగా తన నివాసానికి రావాల్సిందిగా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు ఏక్ నాథ్ షిండే. ఆయన కోరిక మేరకు ఇంటికి వెళ్లారు. ఘనంగా సాదర స్వాగతం పలికారు సీఎం. ఈ సందర్బంగా ఇరువురు ముఖ్యమంత్రులు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు.
ఇద్దరూ గంటకు పైగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం కేంద్రంలో నారా చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ గా ఉన్నారు. మోడీ బీజేపీ సంకీర్ణ సర్కార్ ప్రస్తుతం ఆయన మద్దతుతోనే నడుస్తోంది. ఈ తరుణంలో షిండే, బాబు భేటీ వెనుక ఏం జరిగిందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.