గవర్నర్ నజీర్ తో బాబు భేటీ
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం
అమరావతి – టీడీపీ చీఫ్ , కూటమి శాసన సభా పక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అంతకు ముందు టీడీపీ ఏపీ చీఫ్ కె. అచ్చన్నాయుడు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ , బీజేపీ ఏపీ చీఫ్ , రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి గవర్నర్ తో భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా కూటమి తరపున 164 మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. ఈ మేరకు మూడు పార్టీల తరపున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా లేఖను అబ్దుల్ నజీర్ కు అందజేశారు.
ఇదిలా ఉండగా ఇవాళ గవర్నర్ సారథ్యంలో అమరావతిలోని ఐటీ ప్రాంగణంలో చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కానున్నారు.