ప్రధానితో ముగిసిన చంద్రబాబు భేటీ
కీలక అంశాలపై చర్చించినట్లు టాక్
న్యూఢిల్లీ – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన షెడ్యూల్ ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కీలక కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ,శుక్రవారం కూడా తన పర్యటనలో భాగంగా మరికొందరితో భేటీ అవుతారని టీడీపీ తెలిపింది.
ఇదిలా ఉండగా గురువారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇందులో ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ప్రధానితో చర్చించినట్లు సమాచారం.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీ సర్వ నాశనమైందని, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో భ్రష్టు పట్టించారని వాపోయారు. ప్రస్తుతం ఏపీ బతికి బట్ట కట్టాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి అని పేర్కొన్నారు.
ప్రధానంగా ప్రస్తుతం ఖజానా ఖాళీగా ఉందని దీనిని నింపేందుకు తక్షణమే ఆర్థిక సాయం చేయాలని కోరారు చంద్రబాబు నాయుడు. ఇతర అంశాలను కూడా పీఎంకు వివరించారు. బడ్జెట్ లో ఏపీకి మేలు చేకూర్చేలా , కేటాయింపులు జరిగేలా చూడాలని విన్నవించారు. దీనికి పీఎం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.