స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
దావోస్ – దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, పెట్రోనాస్ ప్రెసిడెంట్, సీఈఓ మహమ్మద్ తౌఫిక్ తో భేటీ అయ్యారు. గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఏపీ అనుకూలం అని స్పష్టం చేశారు.
విశాఖలో డిజైన్ కేంద్రం ఏర్పాటును పరిశీలించమని థామస్ కురియన్ కు విన్నవించారు. మూలపేటలో పెట్టుబడులకు పెట్రోనాస్ సంస్థకు ఆహ్వానం పలికారు. గూగుల్ తో ఇప్పటికే పలు ఒప్పందాలు చేసుకున్నామన్నారు సీఎం.
ఇదిలా ఉండగా దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్ తో ఏపీ ప్రభుత్వం పలు ఒప్పందాలు చేసుకుందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. కాగా విశాఖపట్నంలో ‘డేటా సిటీ’ ఏర్పాటు చేసేందుకు ఏపీతో ఇప్పటికే ఒప్పందం చేసుకోవడం విశేషం.
ఏపీని ఐటీ హబ్ గా మారుస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ స్థాయిలో ఏఐ యూనివర్శిటీని నెలకొల్ప బోతున్నట్లు వెల్లడించారు. బిల్ గేట్స్ తో పాటు ప్రపంచ దిగ్గజ సంస్థల అధినేతలు తమ యూనివర్శిటీ బలోపేతానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. భవిష్యత్తు అంతా ఏఐ, ఎంఎల్ పైనే ఉండబోతోందన్నారు.