బాబు న్యూ లుక్ అదుర్స్
కెవ్వు కేక అంటున్న ఫ్యాన్స్
అమరావతి – ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ ఏర్పాటు చేయడంతో తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సంతోషానికి లోనయ్యారు. ఆయన సారథ్యంలో జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడింది. తాజాగా రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక , శాసన సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి రికార్డ్ బ్రేక్ చేశాయి.
అత్యధిక సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ దుమ్ము రేపింది. ఊహించని విజయం దక్కడంతో టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలలో మునిగి పోయారు. ఈ సందర్బంగా కొత్తగా కేబినెట్ కూడా ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి దర్శించుకున్నారు .
బెజవాడ కనక దుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని సచివాలయంలో కొలువు తీరారు చంద్రబాబు నాయుడు. కీలక సమీక్షలు చేపట్టారు. అనంతరం గెలుపొందిన తర్వాత పార్టీ ఆఫీసులోకి వచ్చారు. ఈ సందర్బంగా ఓ వీరాభిమాని టీడీపీ మహిళ చంద్రబాబు నాయుడు కోసం తీసుకు వచ్చిన ప్రత్యేక కళ్లద్దాలను ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది.
దీనిని తొలుత వద్దన్నారు బాబు. కానీ ఆమె పట్టు పట్టడంతో చివరకు కళ్లద్దాలను ధరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.