NEWSANDHRA PRADESH

కాలేజీ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశం – సీఎం

Share it with your family & friends

ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లాల‌ని మంత్రికి సూచ‌న

అమ‌రావ‌తి – తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం క‌లిగించింది కృష్ణా జిల్లా లోని గుడ్ల‌వ‌ల్లేరు ఇంజ‌నీరింగ్ కాలేజీలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌. గ‌త కొంత కాలం నుంచీ హిడెన్ కెమెరాలు ఉన్నాయ‌ని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున విద్యార్థినులు ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన అంశం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల‌లో ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది.

ఇదిలా ఉండ‌గా గుడ్ల‌వ‌ల్లేరు కాలేజీ ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించారు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. వెంట‌నే ఆయ‌న ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు. దీని వెనుక ఎవ‌రు ఉన్నార‌నేది తేల్చాల‌ని స్ప‌ష్టం చేశారు.

అంతే కాకుండా హిడెన్ కెమెరాలు ఉన్నాయ‌నే దానిపై లోతుగా విచార‌ణ జ‌ర‌పాల‌ని పేర్కొన్నారు. హాస్ట‌ల్ లో ర‌హ‌స్య కెమెరాలు ఎలా వ‌చ్చాయి, ఎవ‌రు పెట్టార‌నే దానిపై త్వ‌ర‌లోనే వివ‌రాలు తెలియ చేయాల‌ని ఆదేశించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ లను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.