బిల్ గేట్స్ , ప్రతినిధులతో ముఖాముఖి
దావోస్ – సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు దావోస్ పర్యటనలో. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ప్రముఖులతో భేటీ అయ్యారు. మూడో రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో చర్చించారు. యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధిపతులతో సమావేశం అయ్యారు సీఎం. బిల్ గేట్స్ తో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది.
దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో ఎంవోయూ కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు నారా చంద్రబాబు నాయుడు.
ఏపీలో పెట్టుబడులకు వున్న అవకాశాలను ఈ సందర్బంగా వివరించారు. మరో వైపు పండ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, ఉత్పత్తి చేసే కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్ తోనూ సీఎం చర్చలు జరిపారు.
ఇందుకోసం విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించాలని చెప్పారు. బార్లీ, మొక్కజొన్న, వరి వంటి అధిక నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని రైతులతో భాగస్వామి కావాల్సిందిగా కోరారు.