NEWSNATIONAL

మోడీ ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్

Share it with your family & friends

చంద్ర‌బాబు కితాబు

న్యూఢిల్లీ – ఏపీ కాబోయే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. న‌రేంద్ర మోడీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఎన్డీయే – బీజేపీ సంయుక్త స‌మావేశంలో చంద్ర‌బాబు నాయుడుతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్ర‌బాబు నాయుడు స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

త‌న జీవిత కాలంలో ఎంతో మంది కీల‌క‌మైన నాయ‌కుల‌ను చూశాన‌ని అన్నారు. కానీ న‌రేంద్ర మోడీ లాంటి నాయ‌కుడిని తాను చూడ‌లేద‌న్నారు. దేశం ప‌ట్ల ఎంతో విజ్ఞ‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చార‌ని పేర్కొన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

మోడీ లాంటి ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్ ను చూడ‌లేద‌న్నారు. అంత‌ర్జాతీయ స్థాయిలోనూ ఇండియా ప్ర‌తిష్ట‌ను మోడీ దేశ ప్ర‌తిష్ట‌ను ఇనుమ‌డింప చేయడంలో కీల‌కంగా మారార‌ని కొనియాడారు టీడీపీ చీఫ్‌.

మోడీ విజన్‌, సమర్థత, సేవలు దేశానికి ఎంతో అవసరమ‌ని కొనియాడారు. భారత్‌కు సరైన సమయంలో సరైన నాయకుడు దొరికాడని కితాబు ఇచ్చారు. ఈ అవకాశాన్ని భారత్‌ వినియోగించు కోవాలని కోరారు… ఎన్డీఏ పక్ష నేతగా మోడీ పేరును సగర్వంగా బలపరుస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.