వాస్తవాలు తెలిపేందుకే శ్వేత పత్రం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు దుస్థితిని చూస్తే బాధ, ఆవేదన కలుగుతోందన్నారు.
ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు శ్వేత పత్రం విడుదల చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వ విధ్వంసాన్ని వివరించారు. సచివాలయంలో మొదటి బ్లాక్ లో మీడియా సమావేశం నిర్వహించి ప్రాజెక్టు దుస్థితిపై వివరాలు వెల్లడించారు.
పోలవరం విధ్వంసంతో జగన్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం. డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయం జగన్ కు కూడా రెండేళ్ల తర్వాత తెలిసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో పోలవరం ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులు కూడా పూర్తిగా మారి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. వైసీపీ 5 ఏళ్ల విధ్వంసంతో రాష్ట్రం ఎలా నష్టపోయిందో కూలంకుశంగా ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.