NEWSANDHRA PRADESH

మంత్రుల‌కు బాబు దిశా నిర్దేశం

Share it with your family & friends

రంగంలోకి దిగిన ఏపీ సీఎం

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు రంగంలోకి దిగారు. ఆయ‌న సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే మంత్రుల‌తో స‌మావేశం అయ్యారు. ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసంలో ప్ర‌త్యేకంగా స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్రంలో గ‌తంలో కొలువు తీరిన వైసీపీ చీఫ్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ లెక్క‌కు మించి అప్పులు చేసింద‌ని దానిని అధిగ‌మించేందుకు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌నే దానిపై చ‌ర్చించారు.

ఓ వైపు సీఎంగా బిజీగా ఉంటూనే మ‌రో వైపు రాష్ట్ర అభివృద్దిపై ఫోక‌స్ పెట్ట‌డం విశేషం. వ‌య‌సు మీద ప‌డినా ఎక్క‌డా త‌గ్గ‌కుండా ప‌ని మీద ఫోక‌స్ పెట్ట‌డం నారా చంద్ర‌బాబు నాయుడుకే చెల్లింది. త‌న 75 ఏళ్ల జీవిత కాలంలో నిరంత‌రం క‌ష్ట ప‌డ‌టం త‌ప్ప మ‌రోటి తెలియ‌ద‌ని ప‌దే ప‌దే చెబుతూ ఉంటారు.

ప్ర‌భుత్వానికి సంబంధించిన అన్ని శాఖ‌ల‌పై మంత్రుల‌కు అవ‌గాహ‌న ఉండాల‌ని , ఆయా శాఖ‌కు బాధ్య‌త వ‌హిస్తున్న వారు పూర్తి స‌మాచారం తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని , తాను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌లు చేస్తూ , ప‌ర్య‌వేక్షిస్తుంటాన‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా మంత్రుల‌కు దిశా నిర్దేశం చేశారు.