ప్రాజెక్టులు పూర్తి చేయడం ప్రభుత్వ లక్ష్యం – సీఎం
అమరావతి – అనంతపురం ఎక్స్ ప్రెస్ వే
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం జగన్ మోహణ్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారం ఆపితే మంచిదని హితవు పలికారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే జోలికి ప్రస్తుతానికి పోవడం లేదని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. గతంలో ఈ రెండు ప్రాంతాల మధ్య తాము ప్రతిపాదించిన రోడ్డును గత ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు.
అయినా దాన్ని చెడగొట్టాలని తాము అనుకోవడం లేదని చెప్పారు ఏపీ సీఎం. జగన్ చేసినట్లు తానూ చేస్తే అర్థం ఉండదన్నారు. గతంలో తాంము కొత్తవలస మండలంలో ప్రతిపాదించిన గిరిజన యూనివర్సిటీని సాలూరుకు తరలించారని అన్నారు.
ఇప్పుడు దాన్ని కొత్తవలసకు మారిస్తే మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల మేం సాలూరులోనే కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. మేం ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడంపై దృష్టి పెట్టాం తప్పితే వాటిని సమస్యగా మార్చాలని అనుకోవడం లేదన్నారు ఏపీ సీఎం.