మోదీ నాయకత్వం అవసరం
నారా చంద్రబాబు నాయుడు
ఉత్తర ప్రదేశ్ – ప్రధాన మంత్రిగా మరోసారి నరేంద్ర మోదీ కొలువు తీరడం ఖాయమని పేర్కొన్నారు. మంగళవారం యూపీలోని వారణాసికి చేరుకున్నారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇవాళ వారణాసి లోక్ సభ స్థానం కోసం ఎంపీ అభ్యర్థిగా ప్రధాని నామినేషన్ దాఖలు చేశారు.
ఎన్డీయే కూటమికి చెందిన పార్టీల అధినేతలంతా హాజరయ్యారు ఈ నామమినేషన్ కార్యక్రమానికి . ఈ సందర్బంగా మోదీని సన్మానించారు బాబు, పవన్ కళ్యాణ్. అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.
ఎన్డీయే కూటమికి 400 సీట్లకు పైగానే వస్తాయని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇక ఏపీలో జనం సునామీలా ఓటు వేసేందుకు వచ్చారని, వారందరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు చెప్పారు.
ఇక ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని, మోదీ నేతృత్వం అనేది దేశానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు.