తిరుమలలో వేరే నినాదాలు వద్దు
హెచ్చరించిన సీఎం చంద్రబాబు
తిరుమల – ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పుణ్య క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మ స్మరణ తప్ప వేరేది ఉండ కూడదని అన్నారు.
కుటుంబ సమేతంగా ఆ దేవ దేవుడిని దర్శించుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి తిరుమలలో సామాన్యులకు పెద్ద పీట ఉంటుందన్నారు. గతంలో కొలువు తీరిన జగన్ రెడ్డి సర్కార్ భ్రష్టు పట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పవిత్రమైన ఈ కొండ నుంచే ప్రక్షాళన మొదలు పెడుతున్నామని చెప్పారు. తనను రక్షించింది ఆయనేనని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు సుఖంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించడం జరిగిందని చెప్పారు.
ఇక నుంచి ఎవరైనా సరే ఎలాంటి సమస్యలు ఉన్నా లేదా సలహాలు, సూచనలు ఇచ్చినా తాము స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. 5 కోట్ల ప్రజల తరపున రాష్ట్రం బాగుండాలని కోరానని తెలిపారు.