NEWSANDHRA PRADESH

సైకిల్ స్పీడ్..గ్లాసు జోరు

Share it with your family & friends

చంద్ర‌బాబు నాయుడు
అమ‌రావ‌తి – రాష్ట్రంలో టీడీపీ కూట‌మికి ఢోకా లేద‌న్నారు ఆ పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా త‌ణుకులో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

అశేష జ‌న‌వాహినిని చూస్తుంటే విజ‌యం ఖాయ‌మై పోయిన‌ట్టేన‌ని పేర్కొన్నారు. ఇది ప్రారంభం మాత్ర‌మేన‌ని అన్నారు చంద్ర‌బాబు నాయుడు. అగ్నికి వాయువు తోడైంద‌ని, ఇక వారాహి దెబ్బ‌కు జ‌గ‌న్ ఫ్యాన్ ఊడి పోవ‌డం ఖాయ‌మ‌న్నారు .

ప్ర‌జ‌ల నుంచి పుట్టిన ఈ అగ్ని చెడును ద‌హించి వేస్తుంద‌ని, నామ రూపాలు లేకుండా చేస్తుంద‌న్నారు. సైకిల్ స్పీడ్ కు ఇక తిరుగు లేద‌న్నారు. గ్లాసు జోరుకు ఢోకా లేద‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఆరు నూరైనా స‌రే ఈసారి 175 సీట్ల‌కు గాను 150కి పైగానే సీట్లు త‌మ‌కు వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని, ఇక రాబోయే కాలంలో టీడీపీ కూట‌మి ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా పాల‌న కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు టీడీపీ చీఫ్ . ఇక జ‌గ‌న్ రెడ్డి ఇంటికి వెళ్ల‌డ‌మే మిగిలి ఉంద‌న్నారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని తెలిపారు.