NEWSANDHRA PRADESH

గురువుల చేతుల్లోనే పిల్ల‌ల భ‌విష్య‌త్తు

Share it with your family & friends

నైతిక ప్ర‌వ‌ర్త‌న అత్యంత ముఖ్యం

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టెక్నాల‌జీతో పాటు నైతిక ప్ర‌వ‌ర్త‌న‌, విలువ‌లు అనేవి అత్యంత ముఖ్య‌మ‌ని అన్నారు. ఉత్త‌మ ఉపాధ్యాయుల‌ను ఆయ‌న స‌న్మానించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు సీఎం.

రోజు రోజుకు వేగం పెరుగుతోంది కానీ ఇదే స‌మ‌యంలో స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే జ్ఞానం ఇంకా అభివృద్ది చెందాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌పంచంతో పోటీ ప‌డేలా విద్యార్థులు త‌యారు కావాల‌ని పిలుపునిచ్చారు.

ఈ దేశ భ‌విష్య‌త్తు మా చేతుల్లో లేద‌ని మీ చేతుల్లోనే ఉంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. విద్యా రంగానికి పెద్ద‌పీట వేస్తున్నామ‌ని చెప్పారు. మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు.

దేశ ద్వితీయ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, దేశ ప్రధమ విద్యా శాఖ మంత్రి మౌలానా ఆజాద్ లు విద్యారంగానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించు కుంటున్నామ‌ని అన్నారు. . నేటి తరం విద్యార్థులను ఆదర్శ వంతమైన పౌరులు గా తీర్చిదిద్దే బృహత్ బాధ్యత గురువుల పై ఉందన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, విద్యార్థుల్లో నైతిక వర్తన అలవరిచేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ను రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడిగా నియమించిందని చెప్పారు.