జగన్ అవినీతిపై విచారణ చేపడతాం
సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఏపీ మాజీ సీఎం , వైసీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం గౌతమ్ అదానీ పై చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి మాజీ సీఎంపై విచారణ చేపట్టడం గురించి ఆరా తీస్తామన్నారు.
విచిత్రం ఏమిటంటే జగన్ అవినీతి పై అమెరికాలో వేసిన చార్జ్ షీట్ గురించి అందరూ చూశారని అన్నారు . ప్రభుత్వం దీనిపై తదుపరి అధ్యయనం చేస్తుందన్నారు. మొత్తం ఇప్పటికే చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలు, అక్రమాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
తప్పక చర్యలు తప్పవని పేర్కొన్నారు . ఏ ప్రభుత్వమైనా, ఏ వ్యక్తి అయినా అవినీతి చేస్తే సహించేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో, జగన్ రెడ్డి నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే బాధేస్తోందన్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించాడని, తనపై లేనిపోని ఆరోపణలు చేశాడని, కానీ చివరకు కాలమే సమాధానం చెప్పిందన్నారు. ఇవాళ తన బండారం అమెరికా సాక్షిగా బయట పడిందన్నారు నారా చంద్రబాబు నాయుడు.