మారని జగన్ పై మండిపడ్డ బాబు
కర్ర కాల్చి వాత పెట్టినా మారక పోతే ఎలా
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ బాస్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం శాసన సభలో నూతనంగా డిప్యూటీ స్పీకర్ గా ఎంపికైన ఉండి శాసన సభ నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును అభినందించారు. ఈ సందర్బంగా సభను ఉద్దేశించి మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు.
అహంకారంతో విర్రవీగిన జగన్ మోహణ్ రెడ్డికి ఆయన పరివారానికి ప్రజలు కాల్చి వాత పెట్టారంటూ ఎద్దేవా చేశారు. డిప్యూటీ స్పీకర్ గా మీ పదవీ గౌరవాన్ని..సభా గౌరవాన్ని కాపాడండి అని సూచించారు సీఎం.
పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని హింసిస్తూ ఆ దృశ్యాలను సెల్ ఫోన్ ద్వారా జగన్ రెడ్డి చూసి ఆనందించాడంటే తనకు ఇంకా నమ్మ శక్యంగా లేదన్నారు నారా చంద్రబాబు నాయుడు. తనను నన్ను జైల్లో పెట్టినప్పుడు కూడా అక్కడ సీసీ టీవీలు ఉండటం చూసాక నమ్మాల్సివచ్చిందన్నారు.
అసలు ఇలాంటి దుర్మార్గులు ప్రపంచ చరిత్రలో ఉన్నారా అని వాకబు చేస్తే ఒక్కడున్నాడు… పాబ్లో ఎస్కోబార్ ఆ తర్వాత స్థానం జగన్ మోహన్ రెడ్డిదేనంటూ మండిపడ్డారు.